2018 సంక్రాంతి సంబరాలు ~ 2019 వేడుకలకు ఆహ్వానం

సంక్రాంతి... అది ఒక పండగ మాత్రమే కాదు... అనుబూతుల మేళవింపు... ఒక భావోద్వేగం... మన ఒక సంవత్సరానికి సరిపడా సంపాదించుకునే తీపి జ్ఞాపకాల సంబరం.



అలాంటి పండుగని ఈ సంవత్సరం కూడా ఎంతో సరదాగా... పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెమ్మలు, తమ్ముళ్లు, బావలు, మరదళ్ళు, తల్లిదండ్రులు, మామయ్యలు, అత్తయ్యలు, తాతయ్యలు, బామ్మలు.... అందరి పలకరింపులతో మొదలై, కలగలసి కబుర్లతో, ఆటలతో, పాటలతో హోరెత్తే మన సంక్రాంతి పండగని ఏమని వర్ణించగలం... ఆ అనుభూతిని అనుభవిస్తే కానీ మాటల్లో చెప్పలేనిది...

సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది... అది కూడా జనవరి మాసంలో ఎన్నో ఆశలతో మన జీవితాలని కొత్తగా ఆరంభించే సంవత్సరంలో మొదటిగా వచ్చే తొలి క్రాంతి ఈ సంక్రాంతి మనకెంతో విశిష్టమైనది..
ఇలా ఈ పాటలా మొదలవుతుంది మన సంబరం......
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సరదాలు తెచ్చిందే తుమ్మెద
కొత్త ధాన్యాలతో కోడి పందాలతో
ఊరే ఉప్పొంగుతుంటే ఏ ఏ ఏ
ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం
కొత్త అల్లుళ్ళతో కొంటె మరదళ్ళతో పొంగే హేమంత సిరులు .......................

సంక్రాంతి పండగ మొత్తాన్ని తెలియసే అద్భుతమైన పాట ఇది. మనకు చాలా పండగలు ఉన్నప్పటికీ.. వాటిలో ‘సంక్రాంతి’ మాత్రం చాలా ప్రత్యేకం.ఏడాదిలో వచ్చే తెలుగు దనపు తొలిపండుగ. అందుకే సంక్రాంతిని గానంచేయని కవి లేడు తెలుగు నాట.

ఈ పండగకి  మనవాళ్ళందరూ ఒక జాతరలా మళ్ళీ మన ఊరికి రావటం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇలానే సంక్రాంతి పండగని ఎప్పటికీ ఆనందోత్సవాలుగా ప్రతి ఏడాది జరుపుకోవాలనేదే మన రెడ్ స్టార్ యూత్ శ్వాస ఉద్దేశ్యం. ఈ సంవత్సరం వేడుకలు చాల ద్భుతంగా జరిగాయి. అలానే అందరి సహకారం మరువలేనిది. ఇలానే కొనసాగిద్దాం.

ఇంకెన్ని రోజులు, ఇంకా ఇరవై రోజులే ఉంది, బయల్దేరండి... మన కుటుంబాలని, మన మిత్రులని, బంధువులతో కలిసి వేడుకలు చేసుకోటానికి... ఊర్లో వున్నవారు ఆహ్వానించటానికి, బయటున్నవారు బయలుదేరటానికి సిద్ధం కండి.

సమయం వచ్చింది మిత్రమా... ఆటలు, పాటలు, సరదాలు, సంతోషాలు... తెచ్చే పండగ సమయం వచ్చేసింది!

కొత్త ఏడాదిలో వచ్చే తొలి పర్వదినం... సందడి మొదలవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు...

సంవత్సరంలొ ఎన్ని రోజులున్నా, కార్యక్రమాలు అవే. కానీ, పండుగల రోజులు ప్రత్యేకాలు వాటికవే. అందులో సంక్రాంతి అంటే మనకి ఇంకా ప్రత్యేకం..!!!

2017 సంవత్సరం నుండి  "సంక్రాంతి ఆటలు - యువజన మైత్రికి బాటలు" అనే నినాదంతో మన శ్వాస ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది.  మన గ్రామంలో యువత కోడిపందాలు, పేకాట వంటి వాటికి మొగ్గు చూపకుండా  ఇటువంటి ఆటల పోటీలు  నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.

వస్తున్న ఈ 2019  సంక్రాంతి వేడుకలు ఆటలు, పాటలు, వినోదాల మేళవింపుగా మరెన్నో కార్యక్రమాలతో మరింత ఉత్సాహంతో అందరు పాల్గొని.. ఈ ఆనందాన్ని సంవత్సరమంతా మదిలో నిలుపుకుంటారని ఆశిస్తున్నాం.

మరింత సమాచారం కోసం... contact@kothavalasa.in మెయిల్ ద్వారా సంప్రదించండి..

త్వరలో ఆటల పోటీల వివరాల జాబితా విడుదల చేస్తాం...


***అందరం సమానమే - అందరిదీ భాద్యతే***

ఇట్లు
మీ రెడ్ స్టార్ యూత్, కొత్తవలస
శ్వాస ఆర్గనైజేషన్

For more details: you can send mail to contact@kothavalasa.in,
Open our facebook page: https://www.facebook.com/kothavalasa.in

2018 (ఈ ఏడాది) చిత్రమాలికలు ఈ క్రింద వీక్షించగలరు...

ఈ ఫోటోలు, వీడియోలు ఇక్కడ వీక్షించడానికి విచ్చేసినందుకు ధన్యవాదములు. మీ దగ్గర ఉన్న మన సంక్రాంతి ఫోటోలు, వీడియోలు కూడా ఉంటే మాకు పంపించగలరు.. వాటిని కూడా ఇక్కడ పొందుపరుచగలము అని విన్నపం.

































































వీడియోలను వీక్షించండి :