శ్వాస ఆర్గనైజేషన్


ప్రియాతి ప్రియమైన కొత్తవలస గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, సోదర సోదరీమణులందరికీ, మన రెడ్ స్టార్ కుటుంబ సభ్యులకు అందరికి ఇవే మా నమస్కారములు.

ఈ సందర్భంగా అందరికీ మన రెడ్ స్టార్ తరపున కృతఙ్ఞతలు... మన రెడ్ స్టార్, 2011 జనవరి 12 వ తేదీన మన ఊరిలో యువకులందరం స్వామి వివేకానంద గారి స్పూర్తితో ప్రారంభించటం జరిగింది... అది ఆరంభం మాత్రమే కాకుండా... ఇప్పటికీ మన యువకులందరు కలసి 6 సంవత్సరాలుగా వినాయకచవితి ఉత్సవాలు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని... అందరి సహకారంతో నిరంతరాయంగా జరిపిస్తున్నారు... ఇవి ఒక వుత్సవాలుగానే కాకుండా ఒక యజ్ఞంలా మన యువకులలో స్ఫూర్తిని కలిగించేలా చేయటమే మన ముఖ్య ఉద్దేశ్యం. ఆ విధంగా నిజంగానే కొంతవరకు ఒక అడుగు ముందుకు వేశామని ఖచ్చితంగా చెప్పగలం... దీనికి నిదర్శనం ఈ సంవత్సరం సంక్రాంతి కూడా వినాయకచవితిలానే చాలా సంతోషంగా జరుపుకోవటం జరిగింది. ఇలానే మనం మున్ముందు... ఇంకా చాలా కార్యక్రమాలు జరుపుకుంటామని ఆశిస్తున్నాం.

ఇలా మన సంప్రదాయాలు, మన సమిష్టి కృషిని చాటుకుంటూ... భావి తరాలకు స్ఫూర్తిగా నిలవటమే కాకుండా... 3 సంవత్సరాలుగా మన ఊరి ప్రాధమిక పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మనవంతు సహకారాలను ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజున మన రెడ్ స్టార్ శ్వాస ఆర్గనైజేషన్ తరపున అందించటం జరుగుతున్నది... దీనికి సహకరిస్తున్న మన పాఠశాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.

ఇలా ఈ కార్యక్రమాలని అందరి సహాయ సహకారాలు ద్వారా ఇంకా విస్తరించాలని మన శ్వాస ఉద్దేశ్యం... మన ఊరిలో ప్రాధమిక పాఠశాలని కూడా ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది ఇంకా ఎక్కువ పిల్లలని చేర్పించే దిశగా పనిచేయాలని మన సంకల్పం... ఆ దిశగా ఒక్కక్కటిగా ముందుకు సాగుదామని దృఢ నిచ్ఛయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుందాం.

అలాగే ఈ సంవత్సరం కూడా మన పాఠశాలలో కొంతమంది విద్యార్ధులకి ప్రతి సంవత్సరంలానే కొన్ని పుస్తకాల పంపిణీ... స్కూల్ బాగ్ ల పంపిణీ చేయాలని.. వాటిని ఇంకా పెద్ద రీతిలో చేస్తే బాగుంటుందని శ్వాస ఉద్దేశ్యం... కావున ఎవరైనా దాతలు విరాళాలు ఇవ్వదలచుకుంటే ఇంకా మంచిదని భావిస్తున్నాం.

ప్రార్దించే పెదవులకన్నా..., సహాయం చేసే చేతులు మిన్న !!!
సర్వేజనా సుఖినోభవంతు.

ఇట్లు,
శ్వాస (స్వామి వివేకానంద అసోసియేషన్ ఫర్ సోషల్ ఆక్టివిటీస్) 
"రెడ్ స్టార్ యూత్" చెప్పకు... చేయ్...✊✊✊