2018 సంక్రాంతి సంబరాలు ~ 2019 వేడుకలకు ఆహ్వానం

సంక్రాంతి... అది ఒక పండగ మాత్రమే కాదు... అనుబూతుల మేళవింపు... ఒక భావోద్వేగం... మన ఒక సంవత్సరానికి సరిపడా సంపాదించుకునే తీపి జ్ఞాపకాల సంబరం.



అలాంటి పండుగని ఈ సంవత్సరం కూడా ఎంతో సరదాగా... పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెమ్మలు, తమ్ముళ్లు, బావలు, మరదళ్ళు, తల్లిదండ్రులు, మామయ్యలు, అత్తయ్యలు, తాతయ్యలు, బామ్మలు.... అందరి పలకరింపులతో మొదలై, కలగలసి కబుర్లతో, ఆటలతో, పాటలతో హోరెత్తే మన సంక్రాంతి పండగని ఏమని వర్ణించగలం... ఆ అనుభూతిని అనుభవిస్తే కానీ మాటల్లో చెప్పలేనిది...

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.



జయతు జయతు దేవో దేవకీ నందనో యమ్,

జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః !

జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో ,

జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః !!

కృష్ణా!
కృష్ణా!
కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది. 
ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.

శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే.

ఓం దేవకీ గర్భసంజాతాయ నమః 
ఓం యశోదేక్షణ లాలితాయ నమః 
కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి -
ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -
అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం
ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే
అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద.

కృష్ణనామ మహత్యం :-

సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 
కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.
మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!
నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /
ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః 
జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ // 
కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.  

కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /
యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //
కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే 
ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 
నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు. 

కృష్ణ విగ్రహము ఇస్తున్న సందేశం :-

దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే -
1. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీఅననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. 

2. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. అలానే మురళిలోని ఏడురంద్రాలు మనలోని ఏడు చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహంలేని స్వచ్ఛమైన అంతరంగం మురళి (వేణువు). ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు.

కృష్ణుడు ఎక్కువగా మురళివాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కన్పించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం. అత్యున్నత ఆనందం. ప్రాణాయామం అనే సాధనద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస (వాయువు) క్రిందకు పైకీ సాగిస్తే తదేకదృష్టి కల్గి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధిస్థితి కల్గుతుంది. ఈ స్థితే సహజయోగ పరమానందకరస్థితి. ఈ స్థితిలో మానవులుండాలన్నదే కృష్ణసందేశం. 

౩. కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుడుని నీలంరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని  అర్ధం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలంరంగు సూచిస్తుంది. ప్రకృతిలో ఉండడంవలన భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

4. దేవాదిదేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలిఫించంనే ధరించడంలో సందేశమేమిటంటే ఏ స్థితియందున్న ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని.

5. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః / 
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ // 

యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు బీష్మపితామహుడు -

ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః
దశాశ్వమేధీ పునరితి జన్మ 
కృష్ణప్రణామీ న పునర్భవాయ

శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు.

శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం  
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః సంఘనిర్యాణమన్త్రమ్ 
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం 
జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం (ముకుందమాలా)

సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి 
"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము". 

అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

~ మీ శ్వాస

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 2018

ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన ఊరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ లు, పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవటం జరిగింది.
Independence Day kothavalasa red star youth

Independence Day kothavalasa red star youth

Independence Day kothavalasa red star youth

Independence Day kothavalasa red star youth

Independence Day kothavalasa red star youth

మన ఊరి ఉపాధ్యాయులైన సతీష్ మాస్టారు, మధు మాస్టారు ఎంతో మంచిగా బోధిస్తూ, ఇంకా దానిని మరింత అర్ధవంతంగా వివరించటానికి అనుగుణంగా పాఠశాలలో డిజిటల్ విద్య అందించాలని దృఢసంకల్పంతో దానికి కావలసిన ప్రొజెక్టర్ అందించాలని మన శ్వాస ఆర్గనైజషన్ ని కోరటం జరిగింది.

SVASA Organizationస్వాతంత్ర్య దినోత్సవం రోజున మన ఊరి పాఠశాలలో డిజిటల్ విద్యని ప్రోత్సహించటం కొరకు మన శ్వాస ఆర్గనైజేషన్ ప్రొజెక్టర్ అందించటం జరిగింది.
దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు 🙏
We are happy to announce... Today on this august 15th Independence Day our #SVASAOrganization provided a Projector to help in Digitalisation of our School 🙏


మీ శ్వాస.
www.kothavalasa.in
email: contact@kothavalasa.in
www.fb.com/redstaryouth
www.twitter.com/redstaryouth

వినాయకచవితి ఉత్సవాలు 2018 - శ్వాస ఆర్గనైజేషన్

వచ్చేసిందండి, వచ్చేసింది...  చిన్న, పెద్ద, ముసలి అందరం ఎంతగానో ఎదురుచూస్తున్న మన వినాయక చవితి వచ్చేసింది. ప్రతి ఏడాది సంక్రాంతి తరువాత మనమంతా కలిసి ఘనంగా చేసుకునే పండగ రోజు వచ్చేసింది.



ఈరోజుకి సరిగ్గా నెల రోజులే వుంది. ప్రతి సంవత్సరంలా ఈ ఏడాది కూడా చిన్న, పెద్ద, కుల, మత, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరం కలిసి ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఏ ఊరిలోను లేని విధంగా మనం చేసుకోవటం, ఆ వినాయకుడు మన కుర్రాళ్ళకి ప్రసాదించిన మొదటి మంచి లక్షణం. అది అలానే కొనసాగిస్తూ మన భావితరాలకు పునాదులుగా, వాళ్ళ భవిష్యత్తుని నిర్మించే వారధులుగా మనం ఉన్నందుకు అందరం సంతోషపడాల్సిన విషయం.

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తితో, శ్రద్ధగా, క్రమశిక్షణతో కలసిమెలసి అంగరంగ వైభవంగా వినాయకచవితి వేడుకలు జరుపుకోవాలని మన శ్వాస ఆర్గనైసేషన్ కోరుకుంటోంది.


కావున, అందరం ఇన్ని ఏళ్లుగా సమిష్టి కృషితో అందరి ఆర్ధిక సహకారంతో చేసుకుంటున్న విధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ మరొకసారి మీ మీ ఆర్థిక సహాయ సహకారాలని అందించాలని అభ్యర్థిస్తున్నాం.


ఈ సంవత్సరం మన శ్వాస వినాయకచవితి కమిటీని అందరూ నవ యువకులతో రూపొందిందించటం జరిగింది. వాళ్ళు  కూడా ఇప్పటినుండి బాధ్యతాయుతమైన వ్యక్తులుగా, అందరూ కలిసి మెలిసి నడుచుకునే విధంగా ఉంటూ మన అందరినీ ముందుకు నడిపిస్తూ, పిల్లల్ని వాళ్ళతో కలుపుకుంటూ ముందుకు సాగుతారని కోరుకుంటున్నాం.


విరాళాలని ఈ క్రింద బ్యాంకు ఖాతాకు పంపించగలరు.


ACCOUNT NUMBER : 35063043918

IFSC CODE : SBIN0006525
NAME : KALIVARAPU SOMASEKHAR


కమిటీ వివరాలు :


వినాయక చవితి కమిటీ సభ్యులు:

  • కలివరపు సోమశేఖర్ 
  • నారికేళం రవి కుమార్
  • దాసరి దుర్గాప్రసాద్ 
  • కలివరపు భార్గవ సాయి 
  • ముచ్చి కిరణ్
  • బార పోలినాయుడు
  • రెడ్డి చిన్నం నాయుడు   
  • జాగాన వాసుదేవ రావు 
  • ద్వారపురెడ్డి ధనుంజయ రావు 
  • బర్ల రమేష్ 
  • యాండ్రాపు పోలినాయుడు 
  • గంట శ్రీనివాస రావు 
  • ముచ్చి వెంకట నాయుడు 
  • యాండ్రాపు ధనుంజయ రావు 
  • పెద్దింటి అశోక్ కుమార్ 
  • పోరాపు నాగార్జున 
  • ముచ్చి ప్రశాంత్  
  • యడ్ల సత్యనారాయణ
  • ముచ్చి గుంపస్వామి 
  • ముచ్చి ఈశ్వర రావు 
  • కొట్టక్కి వాసుదేవరావు  
  • దాసరి సాయి కుమార్ 
  • రెడ్డి సాయి కుమార్ 
  • పైల సాయి కుమార్
  • బర్ల సాయి కుమార్ 
  • యడ్ల సాయి కుమార్ 
  • ముచ్చి సాయి కుమార్ 
  • ముచ్చి రామారావు 
  • గుణుపూరు రామారావు
  • రెడ్డి మణికంఠ 
  • కలివరపు సాయి తేజ 
  • బార శంకర్రావు


సహాయక కమిటీ:

  • రెడ్డి వెంకటేశ్ 
  • యాండ్రాపు శంకర్రావు
  • రెడ్డి ధనంజయ నాయుడు
  • రెడ్డి ఉపేంద్ర
  • రెడ్డి సూర్యకుమార్  
  • ముచ్చి పోలినాయుడు 
  • యాండ్రాపు వేణు 
  • గంట సత్యనారాయణ 
  • ముచ్చి సింహాచలం
  • జాగాన శ్రీనివాస రావు 
  • కలివరపు నరేష్ కుమార్   
  • గంట మణికంఠ  
  • యాండ్రాపు భాస్కర రావు 
  • బర్ల సత్యనారాయణ 
  • జక్కు రామకృష్ణ 
  • రెడ్డి చక్రధర రావు 
  • పెద్దింటి గిరి 
  • గంట సతీష్ కుమార్ 
  • కోట దుర్గా ప్రసాద్ 
  • బర్ల శంకర్రావు 
  • యాండ్రాపు అప్పారావు 
  • రెడ్డి శ్రీనివాస రావు 
  • నారికేళం తేజ  
  • రెడ్డి ప్రసాద్ 
  • జక్కు ఈశ్వరరావు 
  • జక్కు భాస్కర రావు 
  • యడ్ల శ్రీనివాసరావు 


కమిటీ సలహాదారులు:

  • జాగాన సతీష్ కుమార్
  • ముచ్చి తిరుపతి రావు 
  • పూడు చిన్నారావు 
  • రెడ్డి శంకర రావు  (రామ)
  • రెడ్డి జగదీశ్వర రావు  
  • తూపురు సింహాచలం 
  • జాగాన మహేష్ 
  • బర్ల శ్రీనివాసరావు 
  • జాగాన గుంపస్వామి
  • కుణితి శ్రీనివాసరావు
  • రెడ్డి శ్రీనివాస రావు 
  • యాండ్రాపు అప్పలనాయుడు 
  • రెడ్డి రామకృష్ణ   
  • లాడి వెంకటేష్ 
  • జక్కు రవి కుమార్  
  • రెడ్డి అనిల్ కుమార్ 
  • పూడు శ్రీరామ్ 
  • రెడ్డి సురేష్ కుమార్
  • బార సింహాచలం 
  • జక్కు శంకర్రావు 
  • బర్ల బాలకృష్ణ
  • పోరాపు రామారావు 
  • పెరుమాళ్ళ శంకర్రావు
  • కలివరపు సంతోష్ కుమార్ 


గమనిక:

ఈ కమిటీ అనేది భాద్యతలు పంచుకోవటానికి మాత్రమే కానీ.., దీనిలో ఎవరికీ ఎటువంటి ప్రయోజనాలు, వేతనాలు, పదవులు కానీ లేవు.


***అందరం సమానమే - అందరిదీ భాద్యతే***

జై బోలో గణేష్ మహారాజ్ కీ... జై !!!

ఇట్లు
మీ రెడ్ స్టార్ యూత్, కొత్తవలస
శ్వాస ఆర్గనైజేషన్

For more details: you can send mail to contact@kothavalasa.in,
Open our facebook page: https://www.facebook.com/kothavalasa.in

శ్రీరామ నవమి శుభాకాంక్షలు


రామాయణం:
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ 
ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం 
ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత 
ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం 
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం 
ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం
ఒక మనిషిలోని బలం, మరో మనిషి లోని స్వార్ధం, ఇంకో మనిషి లోని కామం...
ఒకరి ఎదురు చూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు,
అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు. 

అందరికీ  శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
- మీ శ్వాస 



అందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు


చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకునే పండుగ ఉగాది. కొత్త జీవితానికి శుభారంభం పలికే సమయం ఉగాది. తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక ఉగాది. తీయనైన వసంత కోయిల పాట ఉగాది. షడ్రుచుల మేలవింపు మన తెలుగు సంవత్సరాది ఉగాది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుంది.

"ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు. దీనికి ఆధారం వేదాలను ఆధారం చేసుకొని వ్రాయబడిన "సూర్య సిద్ధాంతం" అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం

"'చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'"

అనగా బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి "ప్రభవ" అని పేరు. చివరి అరవైయ్యొవ సంవత్సరం పేరు "క్షయ" అనగా నాశనం అని అర్ధం. కల్పాంతంలో సృష్టి నాశనమయ్యేది కూడా "క్షయ" సంవత్సరంలోనే. అందుచేతనే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది.

ఉగాది రోజు నుండి వసంత ఋతువు మొదలవుతుంది. ప్రకృతి ఒక కొత్త రూపాన్ని సంతరించుకొని మళ్ళీ చిగురించి కొత్త కొత్త అందాలతో అలరిస్తుంది. ఉగాది పండగ  అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి, తలంటు స్ధానం, కొత్త బట్టలు.

ఏది ఏమైనా మనందరం గర్వంగా జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఉగాది పండగ ఒకటి అని చెప్ప వచ్చు.

ఉగాది పచ్చడి అసలు పరమార్ధం

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు. అనే షడ్రుచులు కలసిన సమ్మేళనం. పచ్చడిని పూజలో నైవేధ్యంగా పెట్టిన తరువాత మనం ప్రసాదంగా స్వీకరించాలి.

  • బెల్లం తీపి ఆనందానికి సంకేతం,
  • ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం.
  • వేప పువ్వు చేదు భాధ కలిగించే అనుభవాలుకు సంకేతం,
  • చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులుకు సంకేతం,
  • పచ్చి మామిడి   పులుపు కొత్త సవాళ్లుకు సంకేతం,
  • మిరపపొడి కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులుకు ఎదురొడ్డటానికి సంకేతం.
  • అంటే మనకు ప్రతి సంవత్సరములో సంభవించే కష్టసుఖాలు, మంచిచెడులు సంయమనంతో స్వీకరించాలనే భావన మన మనసులో కలుగ చేస్తుంది. మానవుడు “ఆపదల్లో కుంగిపోకుండా, సంపదల్లో పొంగిపోకుండా, విజయాలు సాధిస్తున్నప్పుడు ఒదిగి ఉంటూ, వైఫల్యాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతూ”  జీవితం సాగించాలని దీని అర్థం.

ప్రకృతికి దూరమౌతోన్న మనిషి తనకు తానే వికృతంగా మారిపోతున్నాడు. ప్రకృతిని ప్రేమిస్తే మనిషి తనను తాను ప్రేమించుకుంటాడు. తనను తాను ప్రేమించుకుంటే ప్రేమ పరమార్ధం అర్ధమౌతుంది. ఇలాంటి అద్భుతమైన భావనను మన సొంతం చేసే ఏకైక పండగ ఉగాది. ఈ ఏడాది శ్రీ విళంబి నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని ఆశిద్దాం.

ఇదే మన రెడ్ స్టార్ యూత్ ఆశ - శ్వాస - అభిలాష.


‘స్త్రీమూర్తి’ కి మన శ్వాస మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

‘ఆమె’... తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే.  నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు.. 



నేటి సమాజానికి స్పూర్తి ...రేపటి సమాజానికి వెలుగు మహిళ.  ప్రపంచంలో ముందుకు వెళుతూ... అభివృద్దిలో, ఆధునిక జీవనపథంలో దూసుకుపోతూ మనవాళ్ళకు తీసిపోమంది. అయితే గ్రామీణప్రాంత మహిళలు, పట్టణాలలోని పేద మహిళలకు మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించాలి.  వారిలో ఆత్మవిశ్వాసం, చైతన్యం తెచీన్దుకు గ్రామీణ ప్రాంతాలలో కూడా సభలు, సమావేశాలు నిర్వహించి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల గురించి తెలియజేయాలి.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా సమైక్య శక్తులుగా, సాహస మూర్తులుగా ఉద్యమించాలని మన రెడ్ స్టార్ యూత్ ఆశ మరియు ఆశయం...



మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’ అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ.. ‘జయహో... జనయిత్రి’.

‘అన్నీ మారుతున్నాయి. మహిళల పట్ల మన ఆలోచనా ధోరణి తప్ప’. అవును ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాని దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా, కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’లు అందరికీ మన శ్వాస మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !!!



శంబర జాతర అశేష జనవాహిని 2018

శంబర పోలమ్మగ్రామదేవత పండగ. పేరుకు పండగ శంబర గ్రామానిదైనా ఉత్థరాంధ్ర మూడుజిల్లాలతోపాటు ఒడిషా,చత్తిస్గడ్ రాష్ట్రాల నుండి ఆశేషంగా నేటి నుండి పదివారాలపాటు విశేషంగా దర్శించుకుంటారు.దసరా పండగ మరుచటి వారం విజయనగరం పైడితల్లమ్మ పండగ జరిగితే,సంక్రాంతి తరువాత వారం పోలమ్మ పండగ జరగడం జిల్లా విశేషం.దూరప్రాంతాలలో ఉండి శంబర వెళ్ళలేని మన మితృలకోసం తల్లిని మీముందు తెస్తున్నాం.

శంబర శ్రీ కరకట్ట పొలమాంబ తల్లి యాత్ర సందర్భంగా అశేష జనవాహిని.





















శంబర పోలమ్మ అమ్మవారి విశిష్టత



శ్రీ శంబరపోలమాంబ

కళింగ ఆంధ్రుల ఆరాధ్య దైవము ఉత్తరంద్రుల కల్పవల్లిగ విరజిల్లుతున్న శ్రీశంబర పోలమాంబ జీవితచరిత్ర ఆశ్యర్యకరంతోపాటు ఆసక్తిని కలిగింస్తుంది. మహిమ స్వరూపిణిగా, శక్తిస్వరూపిణిగా ఘనతకెక్కిన శంబర గ్రామదేవత ఘట్టాలపై విభిన్న కథనాలు ప్రాచుర్యములో ఉన్నట్లు చరిత్రికారులు చెబుతున్నారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ ఆదిశక్తి స్వరూపిణి పార్వతీదేవి అవతారమే పోలేశ్వరియని ప్రతిఏట లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించి ముక్తిని పొందుతున్నారు.

తెలంగాణ ప్రాంతములో సమ్మక్క-సారక్క, అనకాపల్లిలో నూకాలంబ, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల మాదిరిగా శంబర పోలమ్మ సంబరాలు ఘనముగా జరుగుతాయి. పార్వతీపురం గిరిజన ఉపప్రణాలికా ప్రాంతానికి చెందిన మక్కువ మండలం శంబర ప్రాంతము పూర్వము దండకారణ్య ప్రాంతముగా ఉండేది. శంబాసురుడనే రాక్షసుడు ఈప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇతదూ మహా పరాక్రమవంతుడు, మాయావి, ఈయన పరిపాలనలో ప్రజలు, మునులు, ఘోరమైన చిత్రహింసలు అనుభవించేవారు. రాక్షస రాజు బారినుంచి రక్షించమని అప్పటి ప్రజలు, తపస్సంపన్నులు శక్తిస్వరూపిణిని వేడుకోవడముతో ఆమె పోలేరేశ్వరిగా అవతారమెత్తి, శంబాసుర రాక్షసుడుని సంహరించి సుఖ శాంతులు కలుగజేసింది. అప్పటినుండి పోలేశ్వరి పోలమాంబగ ప్రాచుర్యము పొంది ఈ ప్రాంతపు ఆరాధ్య దైవముగా పూజలందుకొంటుంది. శంబాసుర రాక్షసరాజు పరిపాలనలో ఈ ప్రాంతము ఉండటంతో ఈ ప్రాంతానికి శంబర అని పేరువచ్చింది.


అమ్మవారి జననము:బాల్యము

సాలూరు పట్టణానికి 16 కిలోమీటర్లు, మక్కువ గ్రామానికి 6 కిలోమీటర్లు దూరంలో గోమిఖి నదీ పరీవాహక ప్రాంతాన శంబర గ్రామము కొండదొరలు కుటుంబంలో శక్తి స్వరూపిణిగా అవతరించింది. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వర్గీయ పృకాపు అప్పన్నదొర దంపతులకు పోలేశ్వరి జన్మించింది. ఆవతారమూర్తి అగుటచే ఈమె మెరుపుతీగ వలే దేవతా స్త్రీవలే గ్రామస్తుల మధ్య బాల్యం నుంచే ప్రత్యేక జీవన విధానాన్ని కనబరిచింది. ఇంట్లో పనిపాట్లు ఎప్పుడు ముగించేదో ఎవరికీ అంతుబట్టేది కాదు. తల్లిదండ్రులకు, చిన్ననాటి నుంచి తనతో పెరిగిన మేనత్తకు తప్ప ఆమె ఎవ్వరికంట కనిపించేందుకు నిరాకరించేది. స్పష్టంగా ఆమెను ఎవరూ చూడలేక పోయేవారు. యుక్త వయసు వఛ్ఛేవరుకు ఇదే మాదిరిగా వైవిధ్యమైన జీవన విధానం కనబరిచిన ఆమెను పలు ప్రాంతాల ప్రజలు భక్తిభావాలతో కీర్తించడము ప్రారంభించారు.


అమ్మవారి పెళ్లిచూపులు

పోలేశ్వరికీ యుక్తవయస్సు రావడంతో ఆమెకు వివాహం చేయాలన్న తలంపు తల్లిదండ్రులకు విండృది. కుమార్తె జీవన విధానంలో అమె మానవ స్త్రీ కాదని వారు తెలుసుకున్నారు. అందువల్ల ఈమె వివాహం ఎలా జరుగుతిందోనని ఆదిసక్తి స్వరూపిణి పైనే భారం వేశారు. ఆ రోజుల్లో శంబర గ్రామ మునసబుగా గిరడ చిన్నం నాయుడు బాధ్యతలు వహించేవరు. ఒకనాడు నీలాటిఋవున ఆయన దంతాదావనం చేసుకుంటున్నరు. ఆ సమయంలో మోభాసా మామిడిపల్లికి చెందిన కొండదొర కులస్తులు ఆ గ్రామనాయుదుగారితో కలసి పెళ్ళి సంబంధం విషయమై వృరొక పట్టణానికి ప్రయాణం సాగిస్తున్నారు. నీలాట రేవున శంబర మునసబు వారికి ఎదురవ్వడంతో కుశలప్రశ్నలు సంభాషణలో పోలేశ్వరీ గుణగణాలను తెలుసుకున్నారు. అంతటిరో వరి ప్;రయ్/అణాన్ని విరమించుకొని పేకాపు అప్పన్నదొర ఇంటికి వెఅల్లి లాంచనప్రాయంగా పోలేశ్వరిని తమ కోడలుగా చేసుకొనేందుకు సంబంధం ఖాయం చేసుకున్నారు.


అమ్మవారి వివాహం

పోలేశ్వరి వివాహ లగ్నము సమీపిస్తున్న కొలది ఆ గ్రామ మునసబు చిన్నమ్నాయుడుతోపాటు చుట్టుఇప్రక్కల గ్రామాల ప్రజలంతా ఈ సారైనా ఆమెను చూడవచ్చని ఎంతో ఆనందించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. వివాహ లాంఛనాలకు అమె ఒప్పికోలేదు. గృహ జీవనానికి తాను పెళ్ళిచేసుకోవడంలేదని ముత్తైదువగా తాను నిర్వహించాల్సిన మహాకార్యమోకతి వున్నదని తల్లిదండ్రులకు ఆమె వివరించింది. ఎప్పుడూ వృదాంతి ధోరణిగా మాటలాడే కుమార్తె మాట ల్లోని మర్మాన్మి తల్లిదండ్రులు గ్రహించలేక పోయారు. వివాహ ముహూర్తసమయంలో పెళ్ళి పీటలపై ఆమె కూర్చొనక పెళ్ళికుమారుడితో ముట్టాబడిన మంగళసూత్రాలు, పూలదంశను ఒక పుణ్యస్త్రీతో తెప్పించుకొని ధరించింది.


అమ్మవారు భుమిలో కుంగి అవతారం చాలించుట

పోలేశ్వరి తాను మానవజన్మ ఎత్తి నిర్వర్తించాల్చిన పనులు పూర్తయినవని తలంచింది. తన తల్లి ఒడిలో చేరుకోవాలని అవతారాన్ని చాలించేందుకు భర్తతో సవ్వారిలో కూర్చొనేందుకు నిరకరించింది. అత్తవారింటికి పయణ్మైన సమయాన వాయువృగంతో మెరుపుతీగవలే పల్లకిలో ప్రవృశించింది. తనకు తోడుగా పృరంటాలుగా వచ్చేందుకు మేనత్త అయిన పెద్ద పోలమ్మను అంగీకరించినది, పల్లకి తలుపులు మూసుకిని వారు కూచొవడంతొ పోలేస్వరిని వూడాలన్న ఆసతో వున్న గ్రామస్తులకు నిరాశ ఎదురయ్యింది. పల్లకిని శంబర గ్రామం దాటి దక్షిణదిక్కుగా ఒక పర్లాంగు దూరం తీసుకువెళ్లగానీ గులివిందల పోలినాయుడు చెరువు, కిట్టలు తోటవద్ద సవ్వరిని దింపిఛ్చమని బోయిలకు మేబత్తచే ఆపించి ఆడ మరుగు నిమిత్తమని తలచి సవ్వారిని దించి బోయిలు దూరముగా పోయిరి .పోలేస్వరి మెరుపు వలృ బయటకు వచ్చి భుమాతను ప్రార్థించి దారిమ్మని కోరెను. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకంపనలు రేగి ఆ ప్రాంతంలో భూమి బీటలు వారడంతో కంఠము వరకు పోలేశ్వరి భూమిలోదిగబడెను. మేనత్త పెద్దపోలమ్మ భయబ్రాంరురాలై భక్తి శ్రద్ధలతో పోలేశ్వరిని ప్రార్థించి తనను ఇక్యం చేసుకొమ్మని కోరెను. ఆమె మహిమా ప్రభావంతో పెద్దపోలమ్మ భూమిలో పూర్తిగా దిగబడెను. అనంతరము అక్కడకు చేరిన బోయిలు అ ప్రాంతనికి చేరుకొని కంథము వరకు దిగివున్న పోలేస్వరిని చూచి ఆశ్చర్యం ఆందోళనతొ భయకంపితులైనారు. భయపడవలదని బోయిలకు అభయమిచ్చి ముందుగ గుఋఋఅముపై వెళుతున్న తన భర్తను గ్రామస్తులకు జరిగిన విషయాలను తెలిప్;ఇ ఈ ప్రాంతానికి తీసుకురమ్మని ఆగ్యాపించింది. బొయిలు చెప్పిన ప్రకారం ఆమె భర్తను గ్రామ ప్రజలు అప్రదేశానికి చేరుకొని అంతా చూసి ఆశ్చర్యముతో భక్తిశ్రద్ధలటో పోలేస్వరికి నమస్కరించారు. పోలేస్వరి తన భర్తను పిలిచి నీతో సమ్సారిక కష్తసుఖాలను పంచుకొనేందుకు ఈరోజే చేరొక కన్యతో వివహం జౌర్గుతుందని తెలిపెను. అలాగే ఈ గ్రామానికి శంబర గ్రామ డేవత లేనదున శంబరపోలమాంబగా పిలవబడుతూ గ్రామ దేవతపై అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులను సదా రక్షిస్తనని అభయమిచ్చెను. అలాగేగ్రామంలో తనను కొలిచే విధానాన్ని, క్రమాన్ని వవరించి భూమిలో కృంగి అవతారం చాలించెను. ఆమె చెప్పిన ప్రకారమే ఆ దినమే భర్తకు వివాహము జరిగెను. శక్తి స్వరూపిణిగా పోలమాంబ నమ్ముకున్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొంగుబంగారమై ముక్తిని ప్రసాదిస్తుందని చరిత్ర తెలుపుతుంది.


చివరిసారిగా అమ్మవారు పలికిన పలుకులు

  • శమ్బర గ్రామానికి గ్రామ దేవతదా కీర్తిస్తున్న తనను ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పండగను తెచ్చి పూజించాలి.
  • తనను కొలిచి తెచ్చే రోజున ఆనాడు ఉదయము గ్రామములో ఉజ్జిడి తిరిగి చీడ పీడలను పారద్రోలాలి.
  • నా అంపక రోజున గ్రామములో చీడలు ప్రవేశించకుండా గ్రామము చుట్టూ పాలధార పోసి కట్టూకట్టవలెను.
  • సంక్రాంతి పండగనాడు తాను శంబర గ్రామములో ఉండాలి, ఆ రోజున తన పేరున మూలన మడపల్లు పెట్టి పేరంటాల్లకు పసుపు-కుంకుమ ఇవ్వాలి
  • పండగ సోమవారము రాత్రి కొండపల్లివలస దొరలచే తొలివేళ్లు జరపాలి. అనంతరము సింగిడీలు (మొక్కిబడులు) చెల్లించాలి.
  • భాగవత ప్రదర్శనలతో తనను అంపకం చేయాలి, అంపకం రోజున నేస్తపువారైన, ప్రయస్నేహితులున్నా, నాయకరం చేస్తున్న గిరిడి వారింటికి, అనంతరము కరణం గారింటికి తీసుకువెల్లి ఊరేగించమని ఆగ్యాపించి అవతారము చాలించెను-భూమిలో క్రుంగెను.


అమ్మవారి ప్రతిరూపాలు పోతుకుడెరాళ్లు

సంబర పోలమాంబ మహిమలు వర్ణింప శక్యము కానివి. ఆమె మహిమల్లో భాగంగా శంబర గ్రామాన్ని ఆనుకొని కొండపై వున్న రెండు పెద్దబండరాళ్లు పోతుకుడెరాళ్లుగా పిలుస్తూ పూజలందుకుంటున్నాయన్న సాక్ష్యాలు నేటికీ చ్వ్బుతునేచున్నారు. జలాశయంలో న్హాగమైన అమ్మవారి చెరువును నొళ్లించడానికి గ్రామములో ప్రతీ ఇంటివారిని ఏరును తోలుకొని రావాలని గ్రామపెద్దలు అపటి మునసబు గిరిడ చిన్నంనాయుడు ఆగ్యాపించారు. మొదటి రోజున ఊరందరూ తమ తమ ఎద్దులతో ఏరును తోలుకువెళ్లారు. అయితే పోలేశ్వరి తల్లిదండ్రులకు ఎద్దులేనందున ఏరును తోలుకు వెళ్లలేకపోయారు, తెల్లవారి పిలిపించి ఏ శిక్ష విధిస్తారోనని తల్లిదండ్రులు జన్నిపేకాపు అప్పన్నదొర దంపతులు దుఖ్ఖ్హించసాగారు. ఆ రాత్రి సమయంలో వారి కలలో పోలేశ్వరి కనిపించి త మేనత్త నల్లఎద్దుగా, తాను తెల్లఎద్దుగా అవతరించా మని హ్రామస్తులతోపాటు మీరు కూడా ఏరు తోలుకెళ్లమని చెప్పి అంతర్ధానమయ్యెను.వారు తిరిగి వచ్చి చూడగా దొడ్డిలో చూడముచ్చటయిన రెండు ఎద్దులు కనిపించాయి .వాటిని వారు ఏరుపోసి చెరువు వద్దకు తోలుకొనిపోగా అప్పటికే గ్రామస్థులు చెరువుపనిలో ఉన్నారు.జన్నికాపు అప్పన్నదొర ఏరు తోలుకొస్తుండడంతో వారికి ఎద్దులు ఎక్కడవని ఒకరినొకరు గుసగుస లాడుకోవడం మొదలైనది.. ఆ ప్రదేసానికి చేరేసరికి ఆ రెండు ఎద్దులు పులిలా గాండ్రిస్తూ పూసిన పూజ పెద్ద సర్పములా అక్కడివారికి కనిపించాయి.దీంతో గ్రామస్తులూ వారి వారి ఎద్దులూ ప్రాణభయముతో పరుగులెత్తాయి.విషయాన్ని తెలుసుకున్న మునసబు జరిగిన తప్పును ఒప్పుకొని క్షమించమని అప్పన్నదొర దంపతులను బ్రతిమాలాడరు.పోలేశ్వరి మహిమను మనషును ఎరిగిన తల్లిదండ్రులు ఆమెను ప్రార్థించి ఉగ్రరూపాన్ని విడిచిపెట్టమని ప్రాదేయపడ్డరు. పోలమాంబ శాంతించి తన మేనత్త పెద్దపోలమ్మతో ఎద్దులరూపములోనేకొండపైకెక్కి అక్కడరెండు పెద్దబండరాళ్లుగా మారిపోయారు.అప్పటినుంచి ఆ రాళ్లు అమ్మవారి ప్రతిరూపాలుగా భావిస్తు పూజలు జరుపుతున్నారు.నేటికీ వాటిని పోతుకుడెరాళ్లుగా పిలుస్తున్నారు.